గుంటూరు నగరంలో పండ్లు విక్రయించుకునే చిరు వ్యాపారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాక్డౌన్ సడలింపు ఉదయం 9గంటలకు ముగియగా.. సైకిళ్లపై పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులు రోడ్లపై కనిపించారు. ఆ సమయంలో ఇంకా రోడ్లపై ఎందుకు ఉన్నారంటూ అరండల్‌పేట సీఐ శ్రీనివాసరావు గట్టిగా నిలదీశారు. 9గంటల తర్వాత రోడ్లపై కనిపించొద్దంటూ పండ్ల బుట్టలను పోలీసులు తోసివేశారు. వెళ్లిపోతున్నామని చెప్పినా పట్టించుకోలేదు... పోలీసులు పడేసిన పండ్లను తిరిగి బుట్టల్లో వేసుకుని దీనంగా వెళ్లిపోయారు. ఓవైపు పండ్ల రైతులు మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పండ్లు అమ్ముకునే పరిస్థితి లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
పండ్ల వ్యాపారి బుట్టలు నేలపాలు చేసిన పోలీసులు - గుంటూరులో కరోనా కేసులు
పండ్ల రైతులు మార్కెటింగ్ లేక ఇబ్బందిపడుతున్నారు. సైకిల్‌పై వీధి వీధి తిరిగి కొందరు పండ్లు అమ్ముకుంటున్నారు. లాక్‌డౌక్ సడలింపు ఉదయం 9 గంటలకు ముగిసిందని..ఇంకా ఎందుకు రోడ్లపై తిరుగుతున్నారని వారిని పోలీసులు ప్రశ్నించారు. ఇంటికి వెళ్లిపోతున్నామని చెప్పినా వినకుండా సైకిల్‌పై ఉన్న పండ్ల బుట్టలను తోసివేశారు.
police-serious-on-venders-in-guntur