గుంటూరు శంకర్‌విలాస్ కూడలి వద్ద వందకు పైగా వాహనాలను పోలీసులు ఆపి తాళాలు తీసుకున్నారు. వీరిలో చాలామంది అత్యవసర పనులపై వెళ్తున్నవారే ఉన్నామని చెప్పారు. మందుల దుకాణాల్లో పనిచేసే వారు కొందరైతే... ఆసుపత్రులకు వెళ్తున్న వారు మరికొందరు ఉన్నారు. అలాగే బ్యాంకు విధుల కోసం వెళ్తున్న ఓ అధికారిని కూడా పోలీసులు అడ్డుకుని వాహనం సీజ్ చేశారు. గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే మరో వ్యక్తిని నిలువరించారు. వాహనాలను అరండల్ పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారంతా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అత్యవసర సర్వీసుల వారిని అడ్డుకోవటం సరికాదని వాహనచోదకులు అంటున్నారు. కనీసం విషయం తెలుసుకోకుండా ఆపివేయటం సరికాదని ఆగ్రహించారు.
'పోలీసులూ.. ఇదే తీరు?' - @corona ap cases
గుంటూరు నగరంలో లాక్డౌన్ అమలును పోలీసులు కఠినతరం చేశారు. రోడ్లపైకి ఎవరినీ రానీయకుండా చూస్తున్నారు. బయటకు వచ్చిన వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పనులపై వెళ్తున్న వారి వాహనాలు ఆపివేస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు.
అత్యవసర సర్వీసులకు వెళ్లే వాహనాలను సైతం సీజ్ చేసిన పోలీసులు