గుంటూరు జిల్లా రేపల్లెలో గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గోదాముల్లో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 3 లక్షల 20 వేల రూపాయల ఖైనీ, గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు సీజ్ చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. గోదాముల్లో నిల్వ ఉంచి అమ్ముతున్న ఓ వ్యక్తినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సైలు ఫిరోజ్, చాణక్య పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో...