గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం దిండి గ్రామ శివారు మడ అటవీప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్, సివిల్ పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు అడవులదీవి ఎస్సై హరిబాబు తెలిపారు. ఘటనా స్థలంలో సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 25 లీటర్ల సారాను సీజ్ చేశారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి - police ride at dindi village
నిజాంపట్నం మండలం దిండి శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. సారా తీయడానికి సిద్దంగా ఉన్న బెల్లం ఊటలను ధ్వంసం చేసిన పోలీసులు... 25 లీటర్ల సారాను సీజ్ చేశారు.

నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి
తీర ప్రాంతంలో పెరుగుతున్న సారా తయారీ, అమ్మకాలను అరికట్టేందుకు స్థానిక సివిల్, ఎక్సైజ్ పోలీసులు... కలిసి నిత్యం దాడులు నిర్వహిస్తూనే ఉంటామని ఎస్సై హరిబాబు తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు, నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాల గురించి తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.
ఇదీ చూడండి:'తహసీల్దార్లకు జీతాలు చెల్లించని కలెక్టర్లకూ వేతనాలు ఆపాలి'