గుంటూరు జిల్లా రేపల్లె మండలం రుద్రవరం గ్రామంలోని గుట్కా గోడౌన్ పై పోలీసులు దాడులు చేశారు. సుమారు 2 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి.. సరుకు ఎక్కడి నుంచి వస్తుందో, ప్రధాన నిర్వాహకులు ఎవరో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. గుట్కా అమ్ముతున్నట్లు గాని, సరుకు సరఫరా చేస్తున్నట్లు గానీ ఎవరైనా పట్టుబడితే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోదాలు, దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
గుంటూరులో గుట్కా... అమ్మడానికి వీల్లేదన్న సీఐ - గుంటూర జిల్లా పోలీసు రైడ్
గుంటూరు జిల్లా రేపల్లె మండలం రుద్రవరం గ్రామంలోని గుట్కా గోడౌన్ పై పోలీసులు దాడులు చేశారు. 2లక్షల రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న పోలీసులు