గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని వీరవల్లి కళ్యాణ మండపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మండపంలో గది తీసుకుని పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.79 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారందరూ కృష్ణా జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు హెచ్చరించారు.