గుంటూరు జిల్లా తాడేపల్లిలో తాపీమేస్త్రీ నాగరాజు ఆత్మహత్యపై పోలీసులు స్పందించారు. మద్యానికి అలవాటు పడి డబ్బు లేకపోవడం వల్లే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. మద్యానికి బానిసైన నాగరాజు తరచూ భార్యతో గొడవ పడుతున్నాడని గతంలో తమకు ఫిర్యాదు అందిందని తాడేపల్లి సీఐ అంకమ్మరావు చెప్పారు. పనులు లేకపోవటంతో ఇంటి వద్దే ఉంటున్న నాగరాజు మద్యానికి బానిసయ్యాడని వెల్లడించారు.
'ఇసుక కొరత కాదు... మద్యానికి డబ్బు లేకపోవడమే కారణం..!' - ఏపీలో ఇసుక కొరత వార్తలు
మద్యానికి అలవాటు పడి డబ్బు లేకపోవటంతోనే తాపీ మేస్త్రీ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను తాడేపల్లి సీఐ అంకమ్మరావు వెల్లడించారు
police respond on construction worker nagaraju sucide in guntoor district