ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు రోజుల్లో వస్తానని చెప్పి.. ఆరు నెలలైనా రాలేదు..! - కుమార్తెను వదిలేసిన తల్లి

ఆ చిన్నారి తండ్రి చనిపోయాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి వేరే వ్యక్తితో సహజీవం చేస్తూ వదిలేసి పోయింది. బంధువులు భారంగా భావించి పోలీసుల దగ్గరకు చేర్చారు. చివరికి సంరక్షణాలయానికి చేరింది ఆ పాప.

Police rescued child
Police rescued child

By

Published : Jul 18, 2020, 12:03 PM IST

పాపతో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి

పేగు బంధాన్ని మరచిన ఓ తల్లి.. కన్న కుమార్తెను వేరే వాళ్ల దగ్గర వదిలేసి వెళ్లిపోయింది. ఆరు నెలలు గడిచినా రాకపోవటంతో ఆ పాప ఆలనాపాలనా చూస్తున్న వారు పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలికను సంరక్షణాలయానికి అప్పగించారు.

గుంటూరుకు చెందిన ఓ మహిళ.. భర్త మరణించటంతో వేరొకరితో సహజీవనం సాగిస్తోంది. ఆరు నెలల క్రితం పాపను పరిచయస్తులకు అప్పగించి... ఊరెళ్లి రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లిపోయింది. పాప ఆలనాపాలనా చూస్తున్న ఆమెకు కూడా ఆరోగ్యం సరిగా లేకపోవటంతో పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించింది.

తనకు ఏమైనా ఇబ్బంది జరిగితే, ఈ పాప ఒంటరిగా మిగిలిపోతుందన్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్​కు వచ్చినట్లు ఆమె తెలిపింది. వెంటనే పోలీసులు ఆ బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి బాలికను తన కార్యాలయానికి పిలిపించుకుని ధైర్యం చెప్పారు. పాపను బాగా చూసుకోవాలని సంరక్షణాలయం అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి

బోరుమనిపిస్తున్న బోర్లు...అనంతలో అన్నదాతల ఆత్మహత్యలు!

ABOUT THE AUTHOR

...view details