ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ పరేడ్ మైదానంలో వాహనాలు అన్​లాక్​ - పోలీస్ పరేడ్ మైదానంలో వాహనాలు తాజా వార్తలు

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై తిరిగిన వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు తిరిగి వాటిని వాహన యాజమానులకు అప్పగిస్తున్నారు. లాక్​డౌన్​ సమయంలో వేలాది వాహనాలను పోలీసులు సీజ్​ చేశారు. వాటిని తీసుకునేందుకు వచ్చిన వారితో పశ్చిమ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ సందడిగా మారింది.

police released seized vihicles at the lock down time
పోలీస్ పరేడ్ మైదానంలో వాహనాలు

By

Published : May 24, 2020, 4:00 PM IST

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి రావడంతో సీజ్​ చేసిన వాహనాలను తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు. లాక్​డౌన్​ సడలింపులతో డీజీపీ ఆదేశాల మేర వాటిని తిరిగి వాహనదారులకు అందిస్తున్నారు. లోక్ అదాలత్ కోర్టులో వీటిని ప్రవేశపెట్టే వరకు వాహనాలు చెడిపోకుండా యజమానులకు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై వాహనాలు అప్పగిస్తున్నారు. మార్చి 23 నుంచి 26 వరకు స్వాధీనం చేసుకున్న వాహనాలను తొలుత అప్పగిస్తున్న పోలీసులు, రోజుల వారీగా వీటిని వాహనదారులకు అప్పజెబుతున్నారు.

స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో వేలాది వాహనాల్ని ఉంచగా.. వాటిలో నుంచి తమ వాహనం తీసుకోవడం వాహనదారులకు గగనంగా మారింది. వాహనదారులు నుంచి ఆర్సీ, లైసెన్సు, ఇన్సూరెన్స్ ధ్రువపత్రాల నకళ్లను తీసుకుంటున్నారు. కొందర ధ్రువపత్రాలు వాహనంలోనే ఉండిపోవడం, వాహనాలు తీసుకోలేక అగచాట్లు పడుతున్నారు.

ఇవీ చూడండి...

గుంటూరులో అగ్రిగోల్డ్​ ఖాతాదారుల 48 గంటల దీక్ష

ABOUT THE AUTHOR

...view details