డ్రగ్స్ ఊబిలో కూరుకుపోకుండా యువత అప్రమత్తంగా ఉండాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పిలుపునిచ్చారు. క్షణికానందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. డ్రగ్స్ విక్రయించినా... వినియోగించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరులోని మదర్ థెరిస్సా విగ్రహం నుంచి లాడ్జ్ సెంటర్ వరకు జరిగిన మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. డ్రగ్స్ కార్యకలాపాలను ఉక్కపాదంతో అణిచి వేస్తామని... పట్టుబడితే పదేళ్ల వరకు జైలుశిక్ష తప్పదని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.
'మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం... పట్టుబడితే పదేళ్ల జైలు శిక్ష' - గుంటూరు పోలిసుల ర్యాలీ
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ కార్యకలాపాలను ఉక్కపాదంతో అణిచి వేస్తామని... పట్టుబడితే పదేళ్ల వరకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. నగరంలోని మదర్ థెరిస్సా విగ్రహం నుంచి లాడ్జ్ సెంటర్ వరకు జరిగిన మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు.
మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ