గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల తీర ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో మునిరేడు గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్న ఓ స్థావరంపై బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో నిజాంపట్నం పోలీసులు దాడి చేశారు. 15 మంది పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకుని..వారి వద్ద నుంచి లక్షా 26 వేల 600 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...నగదు స్వాధీనం - Police raids on poker sites ... Cash seized
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 15 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
![పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...నగదు స్వాధీనం పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...నగదు స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8909043-25-8909043-1600866141783.jpg)
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...నగదు స్వాధీనం
ఇదీ చదవండి