గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల తీర ప్రాంతల్లోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్, సివిల్ పోలీసులు దాడులు చేశారు. అదవుల గ్రామంలో స్థావరాలను గుర్తించి రైడ్ చేశారు. 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. తీర ప్రాంతంలో పెరుగుతున్న సారా తయారీ అమ్మకాలను అరికట్టేందుకు స్థానిక సివిల్ పోలీసులతో కలిసి నిత్యం దాడులు నిర్వహిస్తూనే ఉంటామని నిజాంపట్నం మండల ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు, నాటుసారా తయారీ జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై దాడి.. 800 లీటర్ల ఊట ధ్వంసం - guntur dst natusara items
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
polcie raids on natusara centers in guntur dst