ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిజాంపట్నంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు - corona cases in guntur dst

గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముందుస్తు సమాచారంతో ఎన్​ఫోర్స్​మెంట్ బృందం దాడులకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

police raids on guntur dst gambling centers at nijampatnam
police raids on guntur dst gambling centers at nijampatnam

By

Published : May 23, 2020, 10:28 PM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నంలో పేకాట శిబిరంపై ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కొద్ది నెలలుగా ఇక్కడ పేకాట ఆడుతున్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం రావటంతో దాడులు చేపట్టాలని ఎన్​ఫోర్స్​మెంట్ బృందాన్ని ఆదేశించారు. దాడులు నిర్వహించగా... చాలామంది పేకాటరాయుళ్లు పరారయ్యారు. ఇద్దరిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్​స్టేషన్​కు అత్యంత సమీపంలోనే పేకాట కేంద్రం ఏర్పాటు చేసినా... ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారని నిజాంపట్నం ఎస్సై శ్రీనివాస్​పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండిటిక్​టాక్​ కోసం పిల్లికి ఉరి- కిరాతకుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details