పేకాట స్థావరాలపై దాడులు... నలుగురిపై కేసు నమోదు - గుంటూరు తాజా న్యూస్
గుంటూరు జిల్లా రేపల్లెలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో చాట్రగడ్డలో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
![పేకాట స్థావరాలపై దాడులు... నలుగురిపై కేసు నమోదు Police raided poker sites in Repalle, Guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10998891-68-10998891-1615670894339.jpg)
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరాలపై జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా చాట్రగడ్డలో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా పేకాట, కోడి పందాలు, నాటు సారా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సాంబశివరావు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో.. గ్రామాల్లో దాడులు నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు.