ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి...నగదు స్వాధీనం - Police raid poker site guntur district

గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 11 మందిని అదుపులోకి తీసుకుని 7 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Breaking News

By

Published : Oct 1, 2020, 6:41 AM IST

గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాలలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 11 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 లక్షల 51 వేల నగదు, 7 కార్లు, 13 బైక్​లు,14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు గ్రామీణ జిల్లాలో ఎక్కడైనా పేకాటగాని, అక్రమ మద్యం రవాణా, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిస్తే 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వివరించారు.

ఇదీ చదవండి

ఆస్తి కోసం కన్న తండ్రినే చంపిన ఇద్దరు కుమారులు

ABOUT THE AUTHOR

...view details