గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం వీరంకవారిపాలెం గ్రామ శివారు మడ అటవీ ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై అడవులదీవి పోలీసులు దాడులు నిర్వహించారు. తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు వెయ్యి లీటర్ల బెల్లం ఊటను, 10 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ఘటనా స్థలంలోని సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంతంలో పెరుగుతున్న సారా తయారీ అమ్మకాలను అరికట్టేందుకు నిత్యం దాడులు నిర్వహిస్తూనే ఉంటామని ఎస్ఐ హరిబాబు తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు, నాటుసారా తయారీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాల గురించి తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.
వీరంకవారిపాలెంలో వెయ్యిలీటర్ల బెల్లం ఊట ధ్వంసం
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం వీరంకవారిపాలెం తీర ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై అడవులదీవి పోలీసులు దాడులు నిర్వహించారు. వెయ్యి లీటర్ల బెల్లం ఊటను, 10 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు.
వీరంకవారిపాలెంలో నాటుసారా