గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోటలోని వార్డు సచివాలయం వీధిలోని.. ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార గృహ నిర్వాహకురాలితోపాటు ముగ్గురు మహిళలు, నలుగురు విటులను అరెస్టు చేశారు.
పట్టుబడిన మహిళల్లో ఒకరిది గుంటూరులోని చుట్టుగుంట ప్రాంతవాసని పోలీసులు గుర్తించగా.. మిగిలిన ఇద్దరు చిలకలూరిపేటకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన పురుషుల‌్లో ఒకరిది నరసరావుపేట కాగా.. ఇద్దరు చిలకలూరిపేట మండలంలోని పసుమర్రని వెల్లడించారు. దీనికి సుగాలికాలనీకి చెందిన మరో వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తుండాటని అర్బన్ ఎస్సై నరసదాసు తెలిపారు.