ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Arrest: చింతరేవులో 80 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్​..రూ.48 లక్షలు స్వాధీనం - guntur district news

గుంటూరు జిల్లా తీర ప్రాంతమైన చింతరేవులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 80 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

seb police raids on a gambling den
seb police raids on a gambling den

By

Published : May 29, 2021, 7:25 AM IST

Updated : May 29, 2021, 9:29 AM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని చింతరేవులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి (Police raid) చేశారు. జిల్లా SEB పోలీసు అధికారులు చేసిన.. ఈ దాడుల్లో నిర్వాహకులతో పాటు 80 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.48 లక్షల నగదు స్వాధీనం చేసుకుని.. 40 కార్లను సీజ్ చేశారు.

తీర ప్రాంతంలో ప్రత్యేక డెన్ ఏర్పాటు చేసి శిబిరాన్ని నిర్వాహకులు నడుపుతున్న పోలీసులు తెలిపారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాలకు చెందిన పోలీసులతో దాడి చేయించారు. కరోనా కారణంగా వీరందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నట్లు వారు తెలిపారు.

Last Updated : May 29, 2021, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details