ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో గుట్కా స్థావరాలపై పోలీసుల దాడి - latest news for police rides on gutka

గుట్కా స్థావరాలపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు దాడి చేశారు. సుమారు 8 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా స్థావరాలపై నిరంతరం నిఘా ఉంటుందని గుంటూరు పశ్చిమ డీఎస్పీ రామారావు అన్నారు.

Police raid Gutka manifacuring units in Guntur district
గుట్కా స్థావరాలను పరిశీలిస్తున్న డీఎస్పీ రామారావు

By

Published : Dec 9, 2019, 9:58 PM IST

Updated : Dec 10, 2019, 8:22 PM IST

గుట్కా స్థావరాలను పరిశీలిస్తున్న డీఎస్పీ రామారావు

గుంటూరు విజయపురి కాలనీలో గుట్కా స్థావరాలపై పట్టాభిపురం పోలీసులు దాడి చేశారు. గుట్కా తయారు చేస్తున్న మణికృష్ణ ప్రసాద్, దేవరపల్లి కొటేశ్వర్లను అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ రామారావు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.8 లక్షలు విలువ చేసే గుట్కా తయారీ యంత్రం, 13 గుట్కా బస్తాలు, 50 కేజీల ముడి సరుకు, కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుట్కా స్థావరాలపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. మాదకద్రవ్యాల గురించి స్థానికులకు ఏదైనా సమాచారం తెలిస్తే తక్షణమే తెలియజేయాలని సూచించారు.

Last Updated : Dec 10, 2019, 8:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details