ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో పోలీస్ కవాత్ మైదానంలో ఓపెన్ హౌజ్‌ - గుంటూరులో ఓపెన్ హౌస్ కార్యక్రమం తాజా వార్తలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా గుంటూరులో ఓపెన్ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలను ప్రదర్శించారు.

police open house program at guntur
గుంటూరులో పోలీస్ కవాత్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

By

Published : Oct 22, 2020, 7:21 PM IST

గుంటూరులో పోలీస్ కవాత్ మైదానంలో ఓపెన్ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, ఏకే 47 రైఫిల్, బాంబు స్క్వాడ్, బాంబు డిటెక్టర్, సీసీ కెమెరాలు, క్రైమ్ క్లూస్, అధునాతన తుపాకులు, సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు. ఆయుధాల పరికరాల గురించి విద్యార్థులకు అర్బన్ ఎస్పీ, గ్రామీణ ఎస్పీ వివరించారు.

ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోలీసులు ఎదురు నిలబడి ప్రజల ప్రాణాలను కాపాడతారని గుంటూరు గ్రామీణ ఎస్పీ అన్నారు. పోలీసులు అన్నివేళలా అందుబాటులో ఉంటున్నారని అన్నారు. పోలీసులు పడే కష్టాలు, వారు ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు గురించి విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడానికే ఓపెన్ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించామని ఎస్పీ వివరించారు.

ఇదీ చూడండి. జేబులు నింపుకునేందుకే భారీ జరిమానాలు : అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details