ఇదీ చదవండి
అమరావతి పరిరక్షణ సమితి భేటీ... భారీగా మోహరించిన పోలీసులు - ఏపీ అమరావతి రాజధాని వార్తలు
విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కల్యాణ మండపం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సమావేశం అనంతరం నేతలు ర్యాలీగా మచిలీపట్నం బయల్దేరనున్న నేపథ్యంలో... పోలీసులు కల్యాణ మండపం గేట్లకు తాళాలు వేశారు. బయటివారు లోపలికి, లోపల ఉన్నవారు బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మచిలీపట్నం వరకు ర్యాలీగా వెళ్తామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు.
వేదిక కల్యాణ మండపానికి తాళాలు వేసిన పోలీసులు