కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా... గుంటూరు జిల్లాలో మాత్రం ఆటోలు, ద్విచక్ర వాహనాలు యథేచ్చగా తిరిగాయి. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాహనదారులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసిన ఆటోలు, ద్విచక్రవాహనాలను సీజ్ చేసి నగరపాలెం పోలీసు స్టేషన్కి తరలించారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులు రాకుండా అడ్డుకున్నారు. కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
లాక్డౌన్: నిబంధనలు అతిక్రమిస్తే సంగతి ఇంతే..! - గుంటూరులో పో లీసు లాఠీఛార్జ్
కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు డోంట్ కేర్ అంటున్నారు. అలాంటి వారికి లాఠీతో సమాధానం చెప్పారు పోలీసులు. లాక్డౌన్ రెండో రోజు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుంటూరులో రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతే... కొంచెం కూడా బాధ్యత లేకుండా రోడ్డుపైకి వచ్చి మాట్లాడతావా అంటూ పోలీసులు లాఠీ ఝుళిపించారు. నిబంధనలు అతిక్రమిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పకనే చెప్పారు పోలీసులు.
police-lathi-charge-on-lock-down-violation-in-guntur