ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు 'చలో రామతీర్థం'... కన్నా లక్ష్మీనారాయణకు పోలీసులు నోటీసులు - chalo ramateertham news

కోదండ రాముని విగ్రహం ధ్వంసం ఘటనను ఖండిస్తూ 'భాజపా- జనసేన' నేడు 'చలో రామతీర్థం'కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యక్రమానికి వెళ్లవద్దు అంటూ కన్నా లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేశారు.

police issue notice to bjp leader kanna lakshminarayana
police issue notice to bjp leader kanna lakshminarayana

By

Published : Jan 7, 2021, 4:19 AM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహ ధ్వంసం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ 'భాజపా- జనసేన' సంయుక్తంగా నేడు 'చలో రామతీర్థం' కార్యక్రమం నిర్వహించనున్నాయి. ముందస్తు చర్యగా భాజపా ముఖ్య నేత కన్నా లక్ష్మీనారాయణకు పోలీసులు గృహ నిర్బంధం నోటీసులు జారీ చేశారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వచ్చిన పోలీసులు.. ఆయన కుమారుడు నాగరాజుకు నోటీసులు అందజేశారు.

కన్నా కుమారుడికి నోటీసులు అందజేస్తున్న పోలీసులు

ఈ నెల 5వ తేదీన చేపట్టిన 'రామతీర్థ ధర్మయాత్ర' కార్యక్రమానికి కూడా పోలీసులు కన్నాను వెళ్లనీయలేదు. గురువారం మాత్రం రామతీర్థం తప్పక వెళ్తానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని పోలీసులు కన్నాకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి బయటికి వస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details