గుంటూరు జిల్లాలో ప్రజా పంపణీ వ్యవస్థ కింద పంపిణీ అవుతున్న రేషన్ సరకుల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా సత్తెనపల్లిలో అయ్యప్ప స్వామి గుడి సమీపంలో 400 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెల్లంకొండ నుంచి సత్తెనపల్లిలోని ఓ మిల్లుకు బియ్యం తరలించే క్రమంలో దుండగులు పోలీసులకు పట్టుబడ్డారు. లారీని అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణాపై దందాపై దర్యాప్తు చేస్తున్నారు.