గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతిపై అత్యాచారం ఘటన తనను కలచి వేసిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరిగే పరిస్థితులు కల్పించేందుకు మరింత కష్టపడి పని చేస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర పోలీసు శాఖ తీసుకొచ్చిన అభయం, దిశ యాప్‌లు అందరూ వినియోగించేలా మరింత ప్రచారం చేస్తామని చెప్పారు.
బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి...
గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 5లక్షల రూపాయల పరిహారం చెక్కును బాధితురాలి తల్లికి అందజేశారు. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు.
తెదేపా నేతల పరామర్శ...