ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Police in Mufti: మఫ్టీలో పోలీసులు.. హైకోర్టు వద్ద కిడ్నాప్‌ కలకలం - ap news

Kidnap Commotion at High Court: హైకోర్టు వద్ద ఓ ఎన్​ఆర్​ఐని కిడ్నాప్ చేయటానికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారన్న సమాచారం తుళ్లూరు పోలీసులను పరుగులు పెట్టించింది. అయితే ఓ కేసులో నిందితుడిని పట్టుకోవటానికి కృష్ణా జిల్లా పెనుమలూరు పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 23, 2023, 9:39 AM IST

హైకోర్టు వద్ద కిడ్నాప్‌ కలకలం

Police in Mufti at High AP Court : హైకోర్టు వద్ద ఓ ఎన్​ఆర్​ఐని కిడ్నాప్ చేయటానికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారన్న సమాచారం తుళ్లూరు పోలీసులను పరుగులు పెట్టించింది. అయితే ఓ కేసులో నిందితుడిని పట్టుకోవటానికి కృష్ణా జిల్లా పెనుమలూరు పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

అనుమానాస్పదంగా కొందరు.. స్టేషన్​కు తరలింపు : పెనమలూరుకు చెందిన ఎన్​ఆర్​ఐ శ్రీనివాసరావు తన న్యాయవాదితో కలిసి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయటానికి వచ్చారు. కోర్టు వెలుపల కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటంతో తన న్యాయవాది మహేష్ ద్వారా బార్‌ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే బార్‌ కౌన్సిల్‌ ఈ విషయాన్ని హైకోర్టు పీపీ ద్వారా తుళ్లూరు డీఎస్పీకి సమాచారమిచ్చారు. డీఎస్పీ పోతురాజు స్పందించి తుళ్లూరు-2 సీఐ శేషగిరి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావులను హైకోర్టు వద్దకు పంపారు. వారు వెళ్లిన సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసులు స్టేషన్‌కు పట్టుకెళ్లారు.

నిందితుడిని పట్టుకొవడానికి వచ్చిన మఫ్టీ పోలీసులు.. ఎస్పీతో డీఎస్పీ:అయితే తాము పోలీసులమని నిందితుడిని పట్టుకోవటం కోసం సాధారణ దుస్తుల్లో వచ్చినట్లు తెలిపారు. ఓ కేసులో నిందితుడిని పట్టుకొవడానికి వచ్చామని, నిందితుడిని గుర్తుపట్టడానికి ఫిర్యాదుదారుడిని కూడా తీసుకొచ్చామని వారు తెలిపారు. పెనమలూరు పోలీసులుగా చెబుతున్న వాళ్లు సాధారణ దుస్తుల్లో ఉండటంతో డీఎస్పీ పోతురాజు వారిని విచారించారు. అనంతరం ఆ ముగ్గురిలో పెనమలూరు సీఐ ఉన్నారని నిర్ధారించుకున్నారు. వాళ్లు వచ్చింది నిందితుడుని పట్టుకోవటానికా కాదో తెలుసుకునేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాతోనూ పోతురాజు మాట్లాడారు. తన ఆదేశాల మేరకే వారు వచ్చారని జాషువా చెప్పటంతో ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి సంతకాలు తీసుకుని పంపించేశారు. ఇదే విషయం హైకోర్టు పీపీకి తెలియజేశామని డీఎస్పీ పోతురాజు తెలిపారు.

శ్రీనివాసరావు బెదిరిస్తున్నాడని ఫిర్యాదు.. అతన్ని అరెస్టు చేసేందుకుమఫ్టీలో పోలీసులు : శ్రీనివాసరావు ఓ ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. ట్రస్ట్​కు సంబంధించిన ఆస్తులు కబ్జా చేసేందుకు అదే ట్రస్ట్ సభ్యులుగా ఉన్నహేమంత్ ప్రయత్నిస్తున్నాడని గతంలో శ్రీనివాసరావు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇటీవల జాన్ అనే వ్యక్తితో కలిసి శ్రీనివాసరావు తమను బెదిరిస్తున్నారని కొందరు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి జాన్​ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు కోసం హైకోర్టు వద్దకు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details