కన్న వారిని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవటానికి... గుంటూరు జిల్లా మాచర్ల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు 17 మంది చిన్నారులను గుర్తించారు. వారికి అవసరమైన వసతులు కల్పించడంతో పాటు, విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని, గ్రామీణ సిఐ భక్త వత్సల రెడ్డి, ఎస్సై ఉదయ లక్ష్మీ తెలిపారు.