TDP LEADERS HOUSE ARREST : చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల తీరుపై.. తెలుగుదేశం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలనూ అణచివేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మొదలుకుని.. ముఖ్య నేతల నివాసాల వద్ద తెల్లారేసరికే పోలీసులు మోహరించారు. జాతీయ రహదారి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి ఎవ్వరూ వెళ్లకుండా కంచెలు వేసి.. సర్వీస్ రోడ్డులోనూ రాకపోకలు నిలిపివేశారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే సిబ్బందినీ.. అడ్డుకున్నారు. గుంటూరు వంతరాయపురంలో.. మాజీమంత్రి నక్కా ఆనందబాబును గృహ నిర్బంధం చేశారు. బయటకు వచ్చిన.. ఆనందబాబును పోలీసులు అడ్డగించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆనందబాబు.. కార్యకర్తలతో కలిసి జీవో ప్రతులు తగలబెట్టారు.
గుంటూరు జిల్లాలోని ఇతర నేతలనూ.. పోలీసులు ఇళ్లు దాటనీయలేదు. ధూళిపాళ్ల నరేంద్రను ఆయన స్వగ్రామం చింతలపూడిలో.. గృహనిర్భంధం చేశారు. పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చారు. కార్యకర్తలతో కలిసి జీవోనంబర్ 1 ప్రతులను యరపతినేని తగలబెట్టారు.