ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఓటు హక్కుకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు" - చిలకలూరిపేటలో సమస్యాత్మక గ్రామం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో సమస్యాత్మక గ్రామమైన యడవల్లిలో పోలీసులు సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు. ఎవరైనా ఓటు హక్కుకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Yadavalli
ఓటు హక్కుకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

By

Published : Jan 28, 2021, 8:48 AM IST

పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా, తెదేపా వర్గాల మధ్య చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామంలో ఘర్షణ చేలరేగింది. పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు.

ముందుగా.. సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన యడవల్లిలో అధికారులు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఎవరైనా ఓటు హక్కుకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించబోమని అన్నారు. ఇరు వర్గాలపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్సై భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details