గుంటూరు జిల్లాలో పలుచోట్ల వాహనదారులను డబ్బులు డిమాండ్ చేస్తున్న కి'లేడి' ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెదకాకానిలో ఐదుగురు, నగరపాలెంలో నలుగురు, తెనాలిలో మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ నుంచి 32 మంది మహిళలు గుంటూరుకు వచ్చి ఓ లాడ్జిలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. బృందాలుగా ఏర్పడి నగర శివారు ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
గుంటూరు జిల్లాలో వాహనదారులను నుంచి డబ్బు గుంజుతున్న గుజరాత్ మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు.. గుజరాత్ నుంచి గుంటూరుకు వచ్చి ఓ లాడ్జిలో ఉంటున్నారని.. వీళ్ల ముఠాలో మొత్తం 32 మంది ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గంతో పాటు పెదకాకాని హైవే తదితర ప్రాంతాల్లో వాహనదారులను బెదిరించి డబ్బు గుంజుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు నాలుగైదు బృందాలుగా ఏర్పడి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. వీరందరూ ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. వీళ్ల వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.