ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు ఓపెన్​ హౌస్​.. ఆయుధాలను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు

Police conducts open house showcase: విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకునేందుకు ప్రతియేటా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు వారోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఓపెన్‌ హౌస్‌ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు.. వాటి పనితీరుపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల సందేహాల్ని ఉన్నతాధికారులు నివృత్తి చేశారు.

Police conducts open house showcase
హఫీజ్ ఓపెన్ హౌస్‌

By

Published : Oct 27, 2022, 9:26 PM IST

Open House Programme:: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అనేకచోట్ల అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు. పోలీసు శాఖలో వివిధ సందర్భాల్లో ఉపయోగించే తుపాకులు, ఆయుధాలు, సాంకేతిక తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయుధాల పనితీరుపై పిల్లల సందేహాల్ని ఉన్నతాధికారులు నివృత్తి చేశారు.

గుంటూరు:పోలీసు పరేడ్ మైదానంలో పోలీసులు వాడే పరికరాలు, తుపాకులు, డమ్మీ గ్రనేడ్స్, డ్రోన్స్, ఆయుధాలతో ఓపెన్‌హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఓపెన్ హౌస్‌ ప్రారంభించారు. ఈ ప్రదర్శనను వీక్షించిన పాఠశాల విద్యార్థులు, అధునాతన ఆయుధాల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అరుదైన అనుభవాల్ని సొంతం చేసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

ఏలూరు: పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్‌ ప్రదర్శనకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. విభిన్న ఆయుధాల వాడకంపై సందేహాలను అధికారుల్ని అడిగి నివృత్తి చేసుకున్నారు. నేరస్థులను పట్టుకోవడం, మందుపాతరలను గుర్తించడంలో పోలీసు కుక్కలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి తదితర అంశాల్ని పరిశీలించారు. పోలీసు శాఖ విధులు, సమాజ రక్షణలో పోలీసుల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించామని ఏలూరు ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు.

కాకినాడ:కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన పోలీసులు ఓపెన్ హౌస్ కార్యక్రమానికి మంత్రి దాడిశెట్టి రాజా హాజరయ్యారు. విద్యార్థులతో పాటు ఆయుధ ప్రదర్శనను వీక్షించారు.

పోలీసు ఓపెన్​ హౌస్​.. ఆయుధాలను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details