ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి ఉద్యమం... 550వ రోజుకు చేరుకున్న పోరాటం - amaravathi capital latest news

నేటితో అమరావతి ఉద్యమం 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నివాసం సమీపంలోని చెక్​పోస్టులను తనిఖీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఐకాస ముఖ్యనేతల ఇళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

అమరావతి ఉద్యమం... 550వ రోజుకు చేరుకున్న పోరు
అమరావతి ఉద్యమం... 550వ రోజుకు చేరుకున్న పోరు

By

Published : Jun 19, 2021, 9:12 AM IST

Updated : Jun 19, 2021, 12:28 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటితో 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు రైతులు యత్నిస్తున్నారన్న సమాచారంతో తాడేపల్లిలో భారీగా బలగాలను మోహరించారు. అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో సీఎం నివాసం సమీపంలోని చెక్​పోస్టులను తనిఖీ చేశారు.

ఇవాల్టి ఆందోళనలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం ఇంటి పరిధిలో కొత్త వారికి ఆశ్రయం కల్పిస్తే.. వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐకాస ముఖ్య నేతల ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు. మహిళా ఐకాస నేత సుంకర పద్మశ్రీ ఇంటి వద్ద మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ, తాడేపల్లి వారధి, ఎన్టీఆర్‌ మార్గ్‌లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. ఆందోళనలు, ర్యాలీలకు అనుమతులు లేవన్నారు. ఐకాస ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ధర్నాకు ఐకాస పిలుపుతో ముందస్తుగా నేతలను గృహనిర్బంధం చేశారు. కానూరులో ఐకాస మహిళ నాయకురాలు సుచిత్ర, విజయవాడలో తెదేపా కార్పొరేటర్‌ దేవినేని అపర్ణను గృహనిర్బంధం చేశారు.

Last Updated : Jun 19, 2021, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details