ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి' - గుంటూరు జిల్లా నేటి వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్​డౌన్ సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకోనున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు ఆలయాలు, చర్చి, మసీదు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.

Police conduct meeting to temple, church, masque  Authority in mangalagiri Guntur district
ఆలయాల నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తున్న మంగళగిరి పోలీసులు

By

Published : Jun 7, 2020, 4:52 PM IST

Updated : Jun 7, 2020, 5:26 PM IST

లాక్​డౌన్​తో మూత పడిన ఆలయాలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఆలయాల కమిటీ సభ్యులు, చర్చి నిర్వాహకులు, ముస్లిం పెద్దలతో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు సమావేశం నిర్వహించారు. వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టలేదని... ప్రార్థనా స్థలాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తుల కోసం శానిటైజర్​లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉదయం 7నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే దేవాలయాలు, చర్చిలు, మసీదులను తెరవాలని స్పష్టం చేశారు. ఆలయాల్లో అన్నదానాలకు అనుమతి లేదని.. సమస్యలు వస్తే ఆలయ కమిటీలు పరిష్కరించుకోవాని చెప్పారు.

Last Updated : Jun 7, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details