ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి విషయంలో నమ్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతి ఉంటుందంటూ ఆళ్ల చేసిన ప్రకటనలను రైతులు తమ ఫిర్యాదుకు జత చేశారు. ఇప్పుడు మాటతప్పి తమని మోసం చేసినందున ఎమ్మెల్యే పై కేసు పెట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అన్నిపోలీసు స్టేషన్లలో ఫిర్యాదు - amaravathi issue latest news
తమని నమ్మించి మోసం చేశారంటూ.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై రైతులు మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందంటూ మాట ఇచ్చి.. ఇప్పుడు మోసం చేశారని మండిపడ్డారు.
police compliant
TAGGED:
amaravathi issue latest news