నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సోదాలు చేసిన అధికారులకు ఎలాంటి నకిలీ పురుగు మందులు దొరకలేదు. అయితే అక్కడ డ్యూపాంట్ కంపెనీకి చెందిన ట్రెసర్ కు నకిలీ మందు తయారు చేసి అమ్ముతునట్లు కంపెనీ ప్రతినిధులు జేసీకి ఫిర్యాదు చేశారు. అనుమనితుడిగా గుర్తించిన అధికారులు విచారించగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని ...గుంటూరు పట్నంబజారులోని ఓ దుకాణంలో పని చేస్తున్న ఒక వ్యక్తి రైతులకు విక్రయిస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని అధికారులు వెల్లడించారు.
నకిలీ పురుగు మందుల కలకలం... పోలీసులు తనిఖీలు - గుంటూరు జిల్లాలో నకిలీ పురుగుల మందులు తాజా వార్తలు
గుంటూరులో నకిలీ పురుగు మందులు కలకలం రేపుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్కడ ఏమీ లేకపోవడం ఆశ్చర్యానికి గురయ్యారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
నకిలీ పురుగు మందులు కలకలం పోలీసులు తనిఖీలు