అనంతపురం జిల్లాకు చెందిన సయ్యద్ నూర్ అనే వ్యక్తి మినీ వ్యాన్లో కూరగాయల లోడ్ మాటున గురజాల నుంచి మార్కాపురం గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం రావడంతో మాచర్ల శివారులో ని మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు గుట్కా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3,75,000 ఉంటుందని సీఐ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కూరగాయల మాటున గుట్కా ప్యాకెట్ల తరలింపు - గుంటూరులో గుట్కా పట్టివేత వార్తలు
గుంటూరు జిల్లాలో గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ రూ.3,75,000 ఉంటుందని తెలిపారు.
police caught tobacco products