గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ సమీపంలోని కృష్ణానది బ్రిడ్జిపై కారులో తరలిస్తున్న గంజాయిని స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా సుమారుగా 150 కేజీల గంజాయిని గుర్తించారు.
150 కిలోల గంజాయి పట్టివేత.. నిందితుల పరార్ - 150 kg ganja caught in a car by police in guntur district
గుంటూరు జిల్లా తంగెడ సమీపంలో పోలీసులు 150 కిలోల గంజాయిని పట్టుకున్నారు. తనిఖీ సమయంలో నిందితులు వాహనం విడిచి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

150 కిలోల గంజాయి పట్టివేత
కారులో ఉన్న వస్తువులను పరిశీలిస్తున్న సమయంలో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.