గుంటూరులో నలుగురు దారి దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారుల్లో ఆగి ఉన్న లారీలతో పాటు.. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు గుర్తించారు. దాడులు చేసి వారి నుంచి వాహనాలు, నగదు, సెల్‌ఫోన్లు లాక్కుంటున్నారని తెలిపారు. గత నెల 31న ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఆగి ఉన్న ఇనుప చువ్వలలోడు లారీ డ్రైవర్‌ను, క్లీనర్‌పై దాడి చేసి వారి నుంచి రూ.15 వేలు, సెల్‌ఫోన్ లాక్కొని పారిపోగా లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్టు నరసరావుపేట గ్రామీణ సీఐ వై.అచ్చయ్య అన్నారు.
నలుగురు దోపిడీ దొంగల అరెస్టు - latest robbery news at guntur
నలుగురు దారి దోపిడీ దొంగలను గుంటూరు జిల్లా నరసరావుపేట గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరులో దారి దోపిడీ దొంగలు
గుంటూరు చుట్టుగుంటకు చెందిన వాసిమళ్ల వంశీకృష్ణ, దేవప్రసాద్, యర్రబోతుల అనిల్‌కుమార్, సాధినేని ప్రవీణ్‌కుమార్ దోపిడీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దొంగల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.