ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ వీసీపై కేసు నమోదు - ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర నాయుడుపై కేసు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర నాయుడిపై కేసు నమోదైంది. తనని కులం పేరుతో దూషించారని యూనివర్శిటీ మాజీ ఉద్యోగి మురళీకృష్ణ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర నాయుడుపై కేసు నమోదైంది. వీసీ తనని కులం పేరుతో దూషించారని యూనివర్సిటీ మాజీ ఉద్యోగి మురళీకృష్ణ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు గతంలో యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేశారు. అతన్ని ఏప్రిల్లో ఉద్యోగం నుంచి తొలగించారు. మళ్లీ ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదని... ఈ నెల 23 వ తేదీన దామోదర నాయుడు సచివాలయానికి వచ్చిన సమయంలో మరోసారి కలిసి ప్రస్తావించగా... కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీసీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
TAGGED:
ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం