ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతలపై అనుచిత పోస్టులు.. జనసేన నాయకుడిపై కేసు - జనసేన నేతపై పోలీసు కేసు నమోదు వార్తలు

వైకాపా నేతలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని గుంటూరుకు చెందిన జనసేన నాయకుడు భావన్నారాయణపై పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

police case on janasena leader for social media posts on ycp leaders
భావన్నారాయణ, జనసేన నేత

By

Published : Jul 10, 2020, 9:20 AM IST

అధికార పార్టీ ప్రజాప్రతినిథులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణతో.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి జనసేన నాయకుడు తవిటి భావన్నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ కల్యాణ్ డిమాండ్​పై వైకాపా నేతలు విమర్శలు చేశారు.

వాటిని తప్పుపడుతూ భావన్నారాయణ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని వైకాపా నేత మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భావన్నారాయణపై కేసు నమోదు చేసి స్టేషన్​కు పిలిపించి విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details