ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి గ్రామాల బంద్.. పోలీసుల భారీ బందోబస్తు - police arrangements in amavarathi areas

సీఎం జగన్ 3 రాజధానులపై చేసిన ప్రకటనలకు నిరసనగా అమరావతిలో రైతులు బంద్​ పాటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజధాని గ్రామాల్లో పోలీసుల భారీ బందోబస్తు
రాజధాని గ్రామాల్లో పోలీసుల భారీ బందోబస్తు

By

Published : Dec 19, 2019, 10:50 AM IST

రాజధాని గ్రామాల్లో పోలీసుల భారీ బందోబస్తు

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనపై.. అమరావతి రైతులు 29 గ్రామాల్లో బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. అన్ని గ్రామాలలో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించామని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి చెప్పారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details