కరోనాపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ విశాల్ గున్నీ - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనాపై నిర్వహించిన అవగాహన సదస్సుకు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
![కరోనాపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతున్న ఎస్పీ విశాల్ గున్నీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11204944-411-11204944-1617031086248.jpg)
మాట్లాడుతున్న ఎస్పీ విశాల్ గున్నీ
కరోనా వైరస్ పట్ల నరసరావుపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. పట్టణంలోని కోట సెంటర్లో కరోనాపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. మాస్కులు లేకుండా వాహనాలపై తిరుగుతున్న వారికి పోలీసులు అవగాహన కల్పించారు. అనంతరం మాస్కులు లేని వాహనదారులకు ఎస్పీ మాస్కులను పంపిణీ చేశారు. కరోనా రెండో వేవ్ ఉద్ధృతంగా ఉన్నందున ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. భౌతికదూరం పాటించి.. కరోనాను తరిమికొట్టాలని కోరారు.