గుంటూరు జిల్లా మంగళగిరి డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఒక్కసారి మత్తుపదార్థాలకు అలవాటైతే జీవితం అక్కడితో ఆగిపోతోందని డీఎస్పీ దుర్గాప్రసాద్ చెప్పారు. తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు.
డ్రగ్స్‌కు బానిసలైన విద్యార్థులు.. వాటిని సరఫరా చేసే స్థాయికి చేరుకున్నారని చెప్పారు. వాటికి ఈ స్థాయిలోనే అడ్డుకట్ట వేయాలని.. అందుకే మంగళగిరి, తాడేపల్లిలోని కళాశాలలు, పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. మత్తు పదార్థాల కేసులో ఏ స్థాయి వాళ్లు ఉన్నా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.