గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు దొంగలు అరెస్టు...6 బైక్‌లు స్వాధీనం - గుంటూరు జిల్లాలో ద్విచక్రవాహనాలు దొంగతనం వార్తలు
గుంటూరు జిల్లాలో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలు చేయటం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.
చిలకలూరిపేటకు చెందిన బాజీ పట్టణంలోనే ఓ హోటల్లో పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగిలించడం ప్రారంభించారు. ఈక్రమంలో గుంటూరు నగరంలో 4 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం గుంటురులోని గౌరీ శంకర్ థియేటర్ వద్ద ద్విచక్ర వాహనం దొంగిలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. బాజీకి నకరికల్లు మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన మాలిక్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు.. అతనితో కలసి దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. మాలిక్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి మరో రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి