గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులలో చేతి వాటానికి పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారి పనులు చేస్తున్న నవయుగ కంపెనీలో ఇద్దరు ఉద్యోగులు సుమారు 4లక్షల రూపాయల ఇనుము, డీజిల్‌ను అపహరించారు. ఈ ఘటనపై నవయుగ కంపెనీ ప్రతినిధులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జాతీయ రహదారి పనుల్లో చేతివాటం.. ముగ్గురు అరెస్టు
గుంటూరు జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి పనుల్లో ఇనుము, డీజిల్ అపహరణ పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను, వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయం ఉందని.. అతన్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. జాతీయ రహదారి పనులలో ఇనుము, డీజిల్ అపహరణకు గురైనట్లు నవయుగ కంపనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
police
నవయుగ కంపెనీలో పనిచేసే రాంబాబు, శ్రీనులు రాత్రి వేళల్లో ఉద్యోగంలో ఉన్న సమయంలో ఇనుము, డీజిల్‌ను అపహరించి సాంబశివరావు అనే వ్యక్తికి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో వ్యక్తి ఉన్నారని...త్వరలోనే ఆతన్ని అరెస్టు చేస్తామన్నారు.
ఇదీ చదవండి :నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న ముఠా అరెస్టు