SP VISHAL GUNNI: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పరిధిలో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సామూహిక అత్యాచారం కేసును పోలీసులు చేధించారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని...వారి వద్ద నుంచి లక్షా 73వేల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కొడవళ్లు, సుత్తి స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. నిందితులు కరుడుకట్టిన నేరస్తులు అనిచెప్పిన ఎస్పీ...వీరందరిపైనా 24 కేసులు ఉన్నాయన్నారు. ఒంటరిగా వెళుతున్న మహిళను లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ముఠా సభ్యులది కర్నూలు జిల్లా అని చెప్పిన ఎస్పీ....మొత్తం ముప్పై మంది సిబ్బంది, 8 బృందాలు నేరస్తులను పట్టుకోవడానికి పనిచేసినట్లు తెలిపారు.
SP VISHAL GUNNI:పాలడుగు అత్యాచార కేసులో ఆరుగురు అరెస్టు - guntur district crime news
SP VISHAL GUNNI: పాలడుగు అత్యాచార కేసులో గుంటూరు గ్రామీణ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు.
పాలడుగు అత్యాచార కేసులో ఆరుగురు అరెస్టు
Last Updated : Jan 9, 2022, 2:06 PM IST