గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఎస్సీ సంఘాలు, రాజధాని రైతుల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎన్10 రోడ్డులో కొంతకాలంగా కంకర, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని నేతలు ఆరోపించారు. దీనిపై ఆందోళన చేపట్టేందుకు వచ్చిన నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు ముందస్తు అనుమతిలేకుండా నిరసన తెలిపేందుకు వీలు లేదంటూ పోలీసులు చెప్పారు. . ఇసుక, మట్టి, కంకర అక్రమ తరలింపు వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాలు, రాజధాని రైతుల అరెస్ట్
రాజధానిలో మట్టి, కంకర, ఇసుక అక్రమ తరలింపు పై నిరసన తెలిపేందుకు వచ్చిన ఎస్సీ సంఘాలు, రాజధాని రైతులను పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్ నిబంధనల కారణంగా నిరసన తెలిపేందుకు వీలు లేదని పోలీసులు చెప్పారు.
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత
TAGGED:
గుంటూరు జిల్లా తాజా వార్తలు