ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట రాయుళ్లు అరెస్టు.. రూ.38,500 స్వాధీనం - Arrested Poker Royals

గుంటూరు జిల్లా పోలీసులు పేకాట స్ధావరాలపై దాడులు చేశారు. ఓ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలో ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి.. 38 వేల 500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడిపందేలపై దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

guntur district
పేకాట రాయులు అరెస్టు.. 38,500 నగదు స్వాధీనం

By

Published : May 28, 2020, 10:20 AM IST

గుంటూరు జిల్లా కారంపూడిలో ఓ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. 38 వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ లో ఏపీ గేమింగ్ యాక్టు కింద ఇప్పటివరకు 114 కేసులు నమోదు చేశామన్నారు.

695 మందిపై కేసులు నమోదైనట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు తెలిపారు. పేకాట, కోడిపందేలపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అంతా దూరంగా ఉండాలని గ్రామీణ ఎస్పీ విజయరావు ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details