ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూమి కోసం.. పెదనాన్నను పొట్టన పెట్టుకున్నాడు!

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈనెల 20న జరిగిన హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణమూర్తిని తన తమ్ముడి కుమారుడైన మురళీకృష్ణ... భూ వివాదంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో మురళీకృష్ణతో పాటు అతని కుమారులు, భార్యకు ప్రమేయం ఉన్నట్లు చెప్పారు.

police arrested burripalem murder victims
బుర్రిపాలెం హత్యకేసులో నలుగురు నిందితుల అరెస్టు

By

Published : Dec 26, 2020, 3:53 PM IST

Updated : Dec 26, 2020, 7:13 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈనెల 20న జరిగిన హత్య కేసులో.. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుర్రిపాలెం గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి తన అన్న కుమారుడు మరళీకృష్ణతో పొలం దారి విషయంలో వివాదం నేపథ్యంలో.. ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి గతంలోనూ గొడవలు జరిగాయని.. కృష్ణమూర్తి పేరిట ఉన్న పొలంలో మురళీకృష్ణ వరి పంట వేయగా... దాన్ని కృష్ణమూర్తి దున్నించాడు.

ఈ విషయంలో పెదనాన్నపై కక్షగట్టిన మురళీకృష్ణ.. చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పథకం ప్రకారం ఈనెల 20వ తేదిన కృష్ణమూర్తి పొలానికి వెళ్తున సమయంలో అతనిపై కొడవలి, కత్తి, ఇనుపరాడ్లతో దాడి చేశాడని.. మురళీకృష్ణతో పాటు అతని కుమారులు, భార్య ఈ దాడిలో పాల్గొన్నారని తెనాలి గ్రామీణ పోలీసులు తెలిపారు. నిందితులను ఈనెల 25వ తేదిన నందివెలుగు అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని వారినుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితులను రిమాండ్​కు పంపుతున్నట్లు తెనాలి డీఎస్పి స్రవంతి రాయ్ తెలిపారు.

Last Updated : Dec 26, 2020, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details