గుంటూరులో ప్రభుత్వ స్థలాల అమ్మకాన్ని నిరసిస్తూ తెదేపా, వామపక్షాలు చేపట్టిన ఆందోళనలు పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్, కార్మిక శాఖ స్థలం, నల్లపాడులోని స్థలాల్ని ప్రభుత్వం వేలం వేసేందుకు నిర్ణయించింది. దీన్ని నిరసిస్తూ విపక్షాలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి మార్కెట్ వద్ద ఆందోళన చేసేందుకు తెదేపా, వామపక్షాల నేతలు ప్రయత్నించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ వద్దకు వెళ్లారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి లాలపేట స్టేషన్కు తరలించారు.
తెదేపా, వామపక్షనాయకులను అరెస్టు చేసిన పోలీసులు - police arrest cpm leaders in guntur
గుంటూరులో తెదేపా వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షించాలని ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
తెదేపా, వామపక్షనాయకులను అరెస్టు చేసిన పోలీసులు